‘హిట్ 3’కి టఫ్ ఇచ్చేలా ఉన్న ‘రెట్రో’..!

‘హిట్ 3’కి టఫ్ ఇచ్చేలా ఉన్న ‘రెట్రో’..!

Published on Apr 19, 2025 7:00 AM IST

చాలా రోజులు తర్వాత మన సౌత్ లో సాలిడ్ సినిమాలు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి. మరి వాటిలో నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కించిన క్రేజీ వైల్డ్ యాక్షన్ చిత్రం “హిట్ 3” ఒకటి. కాగా దీనితో పాటుగా స్టార్ నటుడు సూర్య అలాగే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రెట్రో’ కూడా ఒకటి. అయితే ఈ రెండు సినిమాల నడుమ పోటీ మరింత గట్టిగా ఉండేలా ఉందని చెప్పాలి.

హిట్ 3 ట్రైలర్ తర్వాత మంచి అంచనాలు పెరిగాయి. ఇక దీని తర్వాత రీసెంట్ గానే వచ్చిన రెట్రో ట్రైలర్ కూడా మంచి ఎంగేజింగ్ గా ఉండడంతో తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ లో కూడా బజ్ పెరిగింది. సో హిట్ 3 కి మాత్రం మన తెలుగులో కొంచెం టఫ్ ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక ఈ రెండు సినిమాలు మే 1న పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్నాయి. మరి చూడాలి ఏది పెద్ద సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు