వైజాగ్ ని టార్గెట్ చేసిన సూర్య ‘సింగం 3’

వైజాగ్ ని టార్గెట్ చేసిన సూర్య ‘సింగం 3’

Published on Nov 21, 2015 7:00 PM IST

singham-2
పేరుకేమో తమిళ హీరో కానీ తను చేసిన డిఫరెంట్ సినిమాల వలన తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ స్టార్ హీరోనే సూర్య. సౌత్ లో సూర్యకి ఉన్న ఇమేజ్ మరియు క్రేజ్ ని ఒక్కసారిగా డబుల్ చేసిన సినిమా ‘సింగం’. ఈ సినిమా తెలుగులో ‘యముడు’గా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ కూడా పెద్ద హిట్ అయ్యింది. తాజాగా సింగం సీరీస్ కి మూడవ పార్ట్ తీయనున్నారని అలాగే సౌత్ ఇండియాలో మొదటి సారిగా వస్తున్న ట్రైలాజీ సింగం కావడం విశేషం.

డిసెంబర్ నుంచి ‘సింగం 3’ షూటింగ్ మొదలవుతుందని ఇది వరకే తెలియజేశాం. చెప్పిన దాని ప్రకారమే డిసెంబర్ 2 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అది కూడా ఈ సినిమాలో ఫస్ట్ మేజర్ షెడ్యూల్ ని వైజాగ్ లో మొదలు పెట్టనున్నారు. సుమారు 30 రోజుల పాటు వైజాగ్ లో షూటింగ్ జరిపిన తర్వాత తమిళనాడులోని టుటికోరిన్ పోర్ట్ లో సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెడతారు. ‘సింగం’ సిరీస్‌లోని రెండు పార్ట్స్ లోనూ హీరోయిన్‌గా నటించిన అనుష్క, ఈ మూడో పార్ట్ లోనూ కొనసాగనున్నారు.అలాగే మరో హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనున్న ఈ సినిమాకి హరి డైరెక్టర్. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు