తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఫస్ట్ వీకెండ్ అదిరిపోయే వసూళ్లు సాధించిన ఈ చిత్రం, అత్యంత కీలకమైన మండే టెస్ట్ పాస్ అయ్యింది. తమిళనాడులో సోమవారం నాడే డబుల్ డిజిట్ గ్రాస్ అందుకునేలా సాలిడ్ హోల్డ్ చూపించింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా నిలకడైన వసూళ్లతో దూసుకుపోతోంది. జూన్ 4న రామ్ చరణ్ ‘పెద్ది’ వచ్చే వరకు ఈ చిత్రానికి థియేటర్లలో తిరుగుండేలా కనిపించడం లేదు. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా లాంగ్ రన్లో సులభంగా రూ.250 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాడు. త్రిష, ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, స్వాసిక కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించాడు.


