మోడీకి తన సపోర్ట్ తెలియజేసిన సూర్య

మోడీకి తన సపోర్ట్ తెలియజేసిన సూర్య

Published on Oct 5, 2014 8:31 PM IST

surya
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గాంధీ జయంతి సందర్భంగా ‘స్వచ్చ భారత్ అభియాన్’ అనే ప్రోగ్రాంని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం ని ప్రారంభించడమే కాకుండా అయన ఇండియాలో ప్రముఖులైన వారికి, సినిమా ఆహేరోలకి చాలెంజ్ విసిరి వారు ఒక 9 మందికైనా ఈ విషయంపై అవగాహన చేకూర్చాలని కోరారు. ఆయన చెప్పిన వారిలో కమల్ హాసన్, అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు ఇప్పటికే స్పందించగా, ఈ స్పందించిన వారి లిస్టులో తాజాగా సూర్య కూడా వచ్చి చేరారు.

సూర్య ఈ విషయాన్ని సపోర్ట్ చెయ్యడమే కాకుండా ‘ఇప్పుడున్న చిల్డ్రన్స్ ఆరోగ్యం కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. వారి ఆరోగ్యం కాపాడడం కోసం మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా క్లీన్ గా ఉంచుకోవడం ముఖ్యం. హెల్దీ ఇండియా కోసం ఇండియాని క్లీన్ గా ఉంచుదాం. ఇందులో భాగంగా భారత ప్రధాని మోడీ ప్రారంభించిన స్వచ్చ భారత్ అభియాన్ ని సపోర్ట్ చెయ్యండని’ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

తాజా వార్తలు