తన దర్శకుని పార్థివ దేహం కోసం సూర్య ముందడుగు.!

Published on Apr 30, 2021 8:56 am IST

ఈరోజే కోలీవుడ్ కు చెందిన టాలెంటడ్ అండ్ ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ ఊహించని విధంగా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సౌత్ ఇండియన్ సినిమాలో తీరని నష్టం వాటిల్లింది. అయితే దర్శకునిగా ఆనంద్ టాలెంటెడ్ హీరో సూర్యతో ఎక్కువ అనుబంధం ఉన్న సంగతి తెల్సిందే. అలాగే సూర్యకు కూడా అద్భుతమైన సినిమాలు కూడా ఆయన ఇచ్చారు.

మరి వీరికి ఉన్న ఈ ఎమోషనల్ బంధం కోసమే ఏమో సూర్య కేవీ ఆనంద్ అడ్మిట్ అయిన చెన్నై హాస్పిటల్ యాజమాన్యంతో ఆయన పార్థివ దేహాన్ని బయటకు విడుదల చేయాలని చర్చిస్తున్నారట. దీనిని బట్టి సూర్యకు దర్శకుడు ఆనంద్ గారికి ఎలాంటి సాన్నిహిత్యం ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ వార్తతో సూర్య అభిమానులు కూడా తమ ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ తమ హీరోను బలంగా ఉండాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :