సూర్య చేతుల మీదగా “సన్నాఫ్ ఇండియా” టీజర్.!

Published on Jun 3, 2021 12:00 pm IST

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం చిత్రం “సన్నాఫ్ ఇండియా”. ఎప్పుడు నుంచి మంచి హైప్ తో కూడుకొని ఉన్న ఈ చిత్రం చాలా మేర షూట్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

అందుకే ఈ చిత్రం సబ్జెక్టు పై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ చిత్రం తాలుకా టీజర్ ను మేకర్స్ విడుదల చెయ్యడానికి ప్లాన్ చేసారు. కోలీవుడ్ మరియు మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరో సూర్య చేత విడుదల చెయ్యాలని ఫిక్స్ చేశారు.

రేపు జూన్ 4న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా మంచు విష్ణు నిర్మాణం వహిస్తున్నాడు. అయితే ఇది వరకే సూర్య మరియు మోహన్ బాబులు “ఆకాశం నీ హద్దురా”లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :