హిట్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా.?

హిట్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా.?

Published on Sep 22, 2018 8:05 PM IST

తమిళ దర్శకుడు హరి మరియు విలక్షణ నటుడు సూర్య కాంబినేషన్ అంటే… అటు తమిళంలో మరియు ఇటు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. వీరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింగం సిరీస్ చిత్రాలే ఇందుకు నిదర్శనం, దానికి తోడు వీరు ఇద్దరు చేసిన మేజిక్ అలాంటిది మరి, సూర్య ఫాన్స్ సూర్యని ఎలా చూడాలనుకుంటారో.. అంతకు మించి పవర్ ఫుల్ గా సూర్యని పోలీసు పాత్రలో చూపిస్తాడు హరి.

కాగా దర్శకుడు హరి, చియాన్ విక్రంతో ఇప్పటికే తన హిట్ సినిమా అయినా సామి చిత్రానికి సీక్వెల్ సామి స్క్వేర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.ఇప్పుడు తర్వాతి ప్రాజెక్ట్ మళ్ళీ సూర్య తో తెరకెక్కించబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో గాని ఈ కాంబినేషన్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు