మూవీ పరాజయం పై హుందాగా స్పందించిన స్టార్ హీరో.

Published on Jun 7, 2019 4:14 pm IST

తెలుగు లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నతమిళ హీరోల్లో సూర్య కూడా ఒకరు. “గజిని” వంటి బ్లాక్ బస్టర్ మూవీతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న సూర్య, తరువాత సింగం సిరీస్ లలో హై వోల్టేజ్ పోలీస్ మెన్ గా నటించి తన పాపులారిటీని పెంచుకుంటూ పోయారు సూర్య నటించిన “ఎన్జీకే” చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు సెల్వరాఘవన్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడాయి. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా సెల్వరాఘవన్ ఈ మూవీతో విమర్శల పాలైయ్యారు.

ఈ మూవీ పరాజయంపై హీరో సూర్య స్పందించారు. నేడు హీరో సూర్య ట్విట్టర్ లో “ఎన్జీకే చిత్రంపై మీ అభిప్రాయాలని, ప్రేమని, ఆలోచనలని గౌరవంగా స్వీకరిస్తున్నా. అలాగే చిత్రంలో నటీనటుల పెర్ఫామెన్స్ ని మెచ్చుకున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు” అని ట్వీట్ చేశాడు. త్వరలో సూర్య కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “కాప్పాన్” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

More