తమిళ హీరో సూర్య తన కెరీర్‌లో 46వ చిత్రంగా నటిస్తున్న చిత్రాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘విశ్వనాథ్ & సన్స్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. సూర్య ఓ పసి బిడ్డను ఎత్తుకుని ఉన్న పోస్టర్ అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ చేస్తోంది.
ఇక ఈ సినిమాలో అందాల భామ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోండగా రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జూలై నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
