సూర్య లైనప్ లో తాత్కాలికంగా నిలిచిపోయిన మరో సినిమా.!

సూర్య లైనప్ లో తాత్కాలికంగా నిలిచిపోయిన మరో సినిమా.!

Published on Mar 19, 2024 9:04 AM IST


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా ఇప్పుడు దర్శకుడు శివ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “కంగువ” కోసం అందరికీ తెలిసిందే. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ఇది వస్తుండగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి. అయితే ఈ చిత్రం సూర్య కెరీర్ లో 42వ సినిమా కాగా ఈ చిత్రం తర్వాత తన హిట్ దర్శకురాలు సుధా కొంగరతో ఎంతో అట్టహాసంగా తన 43వ సినిమాని సూర్య అనౌన్స్ చేసాడు.

అయితే ఈ చిత్రం నిలిపివేసినట్టుగా సూర్య షాకింగ్ అప్డేట్ ఫ్యాన్స్ కి అందించాడు. అఫీషియల్ గా ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసి పూరణనూరు చిత్రంకి మరింత సమయం కావాల్సి ఉంటుంది మా కలయిక ఎంతో ప్రత్యేకమైంది అలాగే మా హృదయాలకి ఎంతో దగ్గరైంది అని అందుకే మా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.

అతి త్వరలోనే సినిమాని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తామని సూర్య తెలిపాడు. దీనితో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ గా నిలిచింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా లానే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి దర్శకుడు వెట్రిమారన్ తో చిత్రం “వాడి వాసిల్” కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మరి దీనితో సూర్య లైనప్ అయితే ప్రస్తుతం ఇలా అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు