“కంగువ” నుండి సూర్య పవర్ ఫుల్ పోస్టర్!

“కంగువ” నుండి సూర్య పవర్ ఫుల్ పోస్టర్!

Published on Mar 19, 2024 11:50 AM IST


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సిరుత్తై శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం కంగువ (kanguva). దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ (kanguva sizzle) ను నేడు సాయంత్రం 4:30 గంటలకి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుండి సూర్య లుక్ కి సంబందించిన పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేసారు.

పోస్టర్ లో కండలు తిరిగిన శరీరం తో సూర్య కనిపిస్తున్నారు. భీకర పోరాట సన్నివేశం కి సంబందించిన పోస్టర్ అని తెలుస్తోంది. ఈ లుక్ అభిమానులను విశేషం గా ఆకట్టుకుంటుంది. యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌ల సహకారంతో స్టూడియో గ్రీన్‌ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ టీజర్ పై ఎలా ఉండబోతుంది అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు