నేటి నుండి ప్రారంభంకానున్ను సూర్య 37 వ చిత్ర షూటింగ్ !

నేటి నుండి ప్రారంభంకానున్ను సూర్య 37 వ చిత్ర షూటింగ్ !

Published on Jun 25, 2018 4:00 PM IST

surya

రంగం ఫెమ్ కె వి ఆనంద్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న37 వ సినిమా చిత్రీకరణ నేటి నుండి లండన్ లో స్టార్ట్ కానుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, హిందీ విలక్షణ నటుడు బోమన్ ఇరానీ మొదలగు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంలో తెలుగు నుండి యువహీరో అల్లు శిరీష్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు .

వైవిధ్యమైన కథ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య సరసన సాయేషా కథానాయికగా నటిస్తుంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ‘బ్రదర్స్, వీడోక్కడే’ సినిమాల తరువాత కె వి ఆనంద్, సూర్యల కలయికలో వస్తున్న ఈ సినిమా ఫై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య ప్రస్తుతం ఈ సినిమాతో పాటు సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఎన్ జి కె చిత్రంలో నటిస్తున్నాడు ఈ చిత్రం దీపావళి కి విడుదలకానుంది .

తాజా వార్తలు