“భీమ్లా నాయక్” కోసం రైఫిల్ సిద్దం చేస్తున్న రామ జోగయ్య శాస్త్రి!

Published on Sep 1, 2021 7:52 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం లో పవన్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అంతేకాక పవన్ మాస్ ఇమేజ్ కి తగ్గట్లు గా ఈ చిత్రం లో రానా దగ్గుపాటి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మేకింగ్ వీడియో మరియు ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం నుండి టైటిల్ సాంగ్ సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. టైటిల్ సాంగ్ ను రామ జోగయ్య శాస్త్రి గారు రచిస్తున్నారు. ఈ పాట కి మరింత ఎనర్జీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్ ను రామ జోగయ్య శాస్త్రి గారు సోషల్ మీడియా ద్వారా ఈ రోజు రాత్రి 9:09 గంటలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రైఫిల్ కోసం బుల్లెట్ లను లోడ్ చేస్తున్నారు అంటూ చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :