సర్ప్రైజ్ : సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ఊరు పేరు భైరవకోన”

సర్ప్రైజ్ : సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ఊరు పేరు భైరవకోన”

Published on Mar 8, 2024 7:01 AM IST

Ooru-Peru-Bhairavakona

రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యిన హిట్ సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ అలాగే కావ్య తపర్ లు హీరోయిన్స్ గా దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం “ఊరు పేరు భైరవకోన” కూడా ఒకటి. మరి మంచి హిట్ కోసం చూస్తున్న సందీప్ కిషన్ ఫైనల్ గా ఈ సినిమాతో డీసెంట్ కం బ్యాక్ ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు సర్ప్రైజింగ్ గా ఈ చిత్రం ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఈరోజు నుంచే ఈ చిత్రం సైలెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి అప్పుడు థియేట్రికల్ గా మిస్ అయ్యిన వారు ఇప్పుడు డెఫినెట్ గా ఓటీటీ లో ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా రాజేష్ దండ నిర్మాణం వహించారు. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనీల్ సుంకర సమర్పణలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు