స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 36వ సినిమాను ప్రముఖ దర్సకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్దీ రోజుల్ క్రితమే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని 2వ షెడ్యూల్ ను జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ కోసం చెన్నైలో భారీ సెట్ ను కూడా వేశారు.
ప్రేక్షకుల్లో మంచి అంచనాల్ని క్రియేట్ చేసిన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను మార్చి 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇందులో సూర్యకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు నటిస్తున్నారు. దీపావళికి విడుదలకానున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తుండగా ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


