సూర్య 37 ఆ రోజే విడుదలకానుంది !
Published on Aug 30, 2018 11:30 am IST

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం ఇటీవల లండన్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ పొల్లాచిలో జరుగనుంది సెప్టెంబర్లో ఈషెడ్యూల్ మొదలుకానుందని సమాచారం. కె వి ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో మోహన్ లాల్, ఆర్య , ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ్ న్యూ ఇయర్ రోజు ఏప్రిల్ 14న విడుదలకానుంది. హారిస్ జై రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్య కు జోడిగా సయేశా నటిస్తుంది. ఇక సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ‘ఎన్జికె’ చిత్ర షూటింగ్ లో బిజీ గా వున్నాడు. సెప్టెంబర్ లో ఈ చిత్ర షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారట.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook