తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఇటీవల పొల్లాచిలో ప్రాంభమైంది. ‘రంగం’ ఫెమ్ కె వి ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో మోహన్ లాల్, ఆర్య , ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈచిత్రంలో సూర్య కొత్త లుక్ లో కనిపించనున్నాడు. దానికి సంభందించిన ఫొటో ఒకటి నెట్లో వైరల్ అవుతుంది. హారిస్ జై రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్య కు జోడిగా సయేశా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం తమిళ న్యూ ఇయర్ రోజు ఏప్రిల్ 14న విడుదలకానుంది.
ఇక సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘ఎన్జికె’ చిత్ర షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.


