సూర్య 40 ఫస్ట్ లుక్ కోసం అభిమానులు వెయిటింగ్!

Published on Jul 22, 2021 12:57 pm IST

పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే నేడు సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అయితే మరొక పోస్టర్ ను విడుదల చేసి నేడు సూర్య 40 ఫస్ట్ లుక్ డే అంటూ చెప్పుకొచ్చింది. అయితే కళానిధి మారన్ సమర్పణ లో వస్తున్న ఈ చిత్రం లో సూర్య సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈచిత్రం తో పాటుగా మరికొన్ని సూర్య కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు రేపు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :