‘మాస్’తో సూర్య ప్రయోగం..?

‘మాస్’తో సూర్య ప్రయోగం..?

Published on Aug 20, 2014 5:33 PM IST

surya
ప్రయోగాలు చేయడం అంటే ‘గజినీ’ హీరో సూర్యకు మహా సరదా. విభిన్నమైన కథలతో తెరకేక్కే సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపుతాడు. కొత్త కొత్త గెటప్ లలో దర్శనం ఇస్తూ అభిమానులను, ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాడు. సూర్య కెరీర్లో అత్యధిక విజయాలు ప్రయోగాల ద్వారా వచ్చినవే. కొత్తగా ట్రై చేసిన ప్రతిసారి ప్రేక్షకులు ఆదరించారు. సింగం, యముడు మినహాయిస్తే రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలు ఎక్కువగా ప్లాప్ అయ్యాయి. అందుకే తన పాత రూట్ లోకి వెళ్ళిపోయాడు సూర్య.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న తాజా సినిమా ‘మాస్’లో రెండు విభిన్నమైన గెటప్ లలో సూర్య కనిపిస్తారని సమాచారం. ఒక గెటప్ కోసం సూర్య బాగా జుట్టు పెంచుతున్నారని యూనిట్ వర్గాలు తెలిపాయి. లాంగ్ హెయిర్ స్టైల్లో సూర్య డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటారని అంటున్నారు. మరొక లుక్ సాధారణంగా ఉంటుందట. ఈ సినిమాలో నయనతార, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాల తీసే దర్శకుడు వెంకట్ ప్రభు.. సూర్య కోసం అద్బుతమైన స్క్రిప్ట్ రెడీ చేశాడని సమాచారం. సూర్య కెరీర్లో ఇదొక మెమరబుల్ ఫిల్మ్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

తాజా వార్తలు