సూర్య – హరి ల చిత్రం వచ్చే ఏడాది లో ప్రారంభం !

సూర్య – హరి ల చిత్రం వచ్చే ఏడాది లో ప్రారంభం !

Published on Nov 2, 2018 10:00 AM IST

Suriya Hari

తమిళ స్టార్ హీరో సూర్య వరుస చిత్రాలను కమిట్ అవుతున్నాడు. దాంట్లో భాగంగా ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ చిత్రంతో పాటు కేవీ ఆనంద్ తెరెకెక్కిస్తున్న తన 37వ చిత్రంలో నటిస్తున్నాడు.

ఇక ఈ రెండు చిత్రాలే కాకుండా సూర్య మరో రెండు చిత్రాలకు కమిట్ అయ్యాడు. దాంట్లో ఒకటి ‘గురు’ ఫేమ్ సుంద కొంగర తో ఒక చిత్రానికి అలాగే తనకు ‘సింగం’ వంటి బ్లాక్ బ్లాస్టర్ చిత్రాన్ని ఇచ్చిన హరి దర్శకత్వంలో మరో చిత్రంలో ] నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈచిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. అయితే ఈచిత్రం సింగం చిత్రానికి సీక్వెల్ గా రావడం లేదు. డిఫ్రెంట్ స్టోరీ తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు