తెలుగు రాష్ట్రాలలో సూర్య నటించిన “ఎన్ జి కే”కి డీసెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్

Published on May 18, 2019 1:26 pm IST

హీరో సూర్య మొదటిసారి రాజకీయనాయకుడిగా నటిస్తున్న మూవీ “ఎన్.జి.కే” పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. సినిమాకి సరైన ప్రమోషన్ లేని కారణంగా ఈ నెల 31 విడుదల కానున్న కానీ ఎటువంటి సందడి లేదు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 9కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంట. సూర్య మార్కెట్ తో పోల్చుకుంటే ఈ మొత్తము కొంచెం తక్కువనే చెప్పాలి. ఈ మధ్య సూర్య నటించిన ఏ మూవీ కూడా తెలుగులో ఆశించినంత విజయం సాధించలేదు. అది కూడా ఓ కారణం కావచ్చు.

సెల్వ రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సూర్య కి జోడీ గా సాయి పల్లవి, రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఫలక్ నామా దాస్, అభినేత్రి2, సువర్ణసుందరి మూవీస్ కూడా ఈ నెల 31న విడుదల కానున్న తరుణంలో తీవ్రపోటీ ఏర్పడటం ఖాయం. మరి ఇంతటి పోటీ మధ్య సూర్య నటించిన “ఎన్.జి.కే” ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

More