‘సూర్య వర్సెస్ సూర్య’ సెన్సార్ కంప్లీటెడ్.

‘సూర్య వర్సెస్ సూర్య’ సెన్సార్ కంప్లీటెడ్.

Published on Mar 3, 2015 3:25 PM IST

surya vs surya
యువ హీరో సూర్య, త్రిధా చౌదరి జంటగా నటించిన సినిమా ‘సూర్య వర్సెస్ సూర్య’. బేబీ త్రిష సమర్పణలో సురక్షా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ కుమార్ నిర్మించిన ఈ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది. మంచి సినిమా తీశారంటూ సెన్సార్ బోర్డు సభ్యులు ప్రశంసించినట్టు సమాచారం. మార్చి 5న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

పగలు బయటకు రాలేని ఓ కుర్రాడు.. పగలు అంటే ఇష్టపడే అమ్మాయితో ప్రేమలో ఎలా పడ్డాడు. అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. సూర్య కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే కుర్రాడి పాత్రలో నేను నటించాను. సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. అని హీరో నిఖిల్ తెలిపారు.

సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో మధుబాల, తనికెళ్ళ భరణి, సత్య కీలక పాత్రలలో నటించారు. ‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ అందించారు. ఈ సినిమాతో నిఖిల్ హట్రిక్ పై కన్నేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు