
సినిమాలో మాస్ మెచ్చే ఫైట్స్ ఉండాలి, కామెడీ ఉండాలి అనే ఫార్మాట్ ని కాస్త పక్కన బెట్టి, ఓ మంచి కాన్సెప్ట్ ని ఎంచుకొని దాన్ని కమర్షియల్ గా ఎలా ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యలా అని ఆలోచించి కాస్త ఇంటెలిజెంట్ గా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నిఖిల్. తను ఎంచుకున్న ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాల కాన్సెప్ట్ కొత్తగా ఉండడమే కాకుండా ప్రెజెంటేషన్ కూడా ఆడియన్స్ ని మెప్పించడంతో ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇదే తరహాలో నిఖిల్ ట్రై చేస్తున్న మరో సినిమా ‘సూర్య vs సూర్య’. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆడియోని నిన్న సాయంత్రం లాంచ్ చేసారు.
ఈ ఆడియో లాంచ్ లో థియేటర్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ తరిలర్ లోని విజువల్స్ మరియు సత్య మహావీర్ మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తెఆజర్ కంటే ‘సూర్య vs సూర్య’ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎ కండిషన్ రిలేటెడ్ టు ప్రోఫ్ ఏరియా అంటే పగటి పూట బయటకి రాలేకపోవడం. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని వస్తున్నా ఈ సినిమా ద్వారా త్రిద చౌదరి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా చేసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి మల్కాపురం శివకుమార్ నిర్మాత.
‘సూర్య vs సూర్య ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి’