సెన్సార్ పూర్తి చేసుకున్న సూర్యకాంతం !

Published on Mar 26, 2019 10:52 pm IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన తాజా చిత్రం సూర్యకాంతం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. బోల్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది. యంగ్ హీరో వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ ఈచిత్రాన్ని నిర్మించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇక తాజాగా విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండి సినిమా ఫై అంచనాలను పెంచింది. నూతన దర్శకుడు ప్రణీత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 29న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More