ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘సూర్యకాంతం’ !

Published on Mar 26, 2019 4:03 pm IST

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా రాహుల్ విజయ్ హీరోగా ప్రణీత్ బ్రామ్మడపల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్యకాంతం’. మార్చి 29 వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం చిత్రబృందం విడుదల చేసింది.

కాగా ట్రైలర్ ‘నా పేరు అభి’ అంటూ మొదలయింది. ట్రైలర్ చూస్తుంటే సూర్యకాంతం – పూజ అనే ఇద్దరి అమ్మాయిల మధ్యలో నలుగిపోయే అభి అనే కుర్రాడి చుట్టూ ఈ కథ సాగుతున్నట్లు అనిపిస్తోంది.

అలాగే, నిహారిక నటించిన సూర్యకాంతం పాత్ర కూడా ట్రైలర్ లో బాగా హైలెట్ గా నిలిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ లాస్ట్ షాట్ లో నిహారిక వేలు చూపించడంతో ట్రైలర్ సరదాగా ముగుస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా ఫై అంచనాలను పెంచేలా వుంది. ప్రస్తుతం ట్రైలర్ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.

ఇక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సందీప్ ఎర్రమరెడ్డి నిర్మిస్తున్నారు. రాబిన్ మార్క్ సంగీతం అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

More