ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సూర్యకాంతం !

Published on Mar 9, 2019 10:29 pm IST

‘ఒక మనసు ,హ్యాపీ వెడ్డింగ్’ చిత్రాల తరువాత మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తున్న చిత్రం ‘సూర్యకాంతం’. ఈచిత్రం విడుదలకు సమయం దగ్గర పడింది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెడుతుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న ఈచిత్రంలో యువ హీరో రాహుల్విజయ్, నిహారిక కు జోడీగా నటిస్తున్నాడు.

నూతన దర్శకుడు ప్రణీత్ బ్రమండపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 29న విడుదలకానుంది. మరి ఈ ఈచిత్రంతోనైనా నిహారిక హిట్టు కొడుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More