సూర్య ను మరో స్థాయిలో నిలబెట్టిన “సూరారై పోట్రు”

Published on Aug 20, 2021 6:45 pm IST

సూర్య హీరోగా నటించిన సూరారై పొట్రు చిత్రం విడుదల అయి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సూర్య కెరీర్ లో ఉత్తమ మైన చిత్రం అని చెప్పాలి. తాజాగా ఈ చిత్రం రెండు అవార్డులను సొంతం చేసుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ తాజాగా అవార్డులను ప్రకటించడం జరిగింది. అందులో సూర్య హీరోగా నటించిన సూరారై పోట్రు చిత్రం రెండు అవార్డ్ లను గెలుచుకుంది. బెస్ట్ ఫిల్మ్ మరియు బెస్ట్ యాక్టర్ గా సూర్య ను ప్రకటించడం జరిగింది.

సూర్య చిత్రం ఇలా రెండు అవార్డు లని గెలుచుకోవడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు సైతం విషెస్ తెలుపుతున్నారు. సూర్య ను మరొక లెవెల్ లో నిలబెట్టిన ఈ చిత్రం నిజ జీవిత గాథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తమిళం లో మాత్రమే కాకుండా తెలుగు లో కూడా ఆకాశం నీ హద్దురా పేరిట అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులకి అందుబాటులో ఉంది.

సంబంధిత సమాచారం :