“సూర్యాస్తమయం” సినిమాకు ప్రశంసల వెల్లువ..!

Published on Aug 28, 2021 2:03 pm IST

ప్ర‌వీణ్ రెడ్డి, బండి స‌రోజ్‌, హిమాన్షి, కావ్యా సురేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సూర్యాస్త‌మ‌యం’. బండి స‌రోజ్ దర్శకత్వంలో శ్రీహార్‌సీన్ ఎంట‌ర్‌టైన్మెంట్ పతాకంపై క్రాంతి కుమార్ తోట నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంటుంది.

ఈ సందర్భంగా నిర్మాత క్రాంతికుమార్ తోట మాట్లాడుతూ ప‌దేళ్ల ముందు నిర్మాత‌గా చేసిన త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు సినిమా చేస్తున్నానని, సూర్యాస్త‌మ‌యం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మా హీరో ప్రవీణ్ రెడ్డికి నటన పరంగా మంచి ప్రశంసలు అందుతున్నాయని, మిగతా నటీనటులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న తప్పుడు వదంతులని నమ్మకండని, మా సినిమాను ఆదరించండని అన్నారు.

ప్ర‌వీణ్ రెడ్డి మాట్లాడుతూ మా సినిమాకి మంచి స్పందన వస్తుందని, ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించిన క్రాంతి కుమార్ తోట గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించారని, ఈ సినిమాని మరింత ఆదరించి మరింత విజయాన్ని అందించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

ప్రొడ్యూసర్ రఘు మాట్లాడుతూ సూర్యస్తమయం సినిమాకి మంచి స్పందన వచ్చిందని, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. శ్రీహార్‌సీన్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యానర్ ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ సినిమాని తెరకెక్కించారని వారికి కూడా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ తెలిపాడు.

సంబంధిత సమాచారం :