దివాళి, క్రిస్మస్ కి వస్తున్న ఇద్దరు టాప్ హీరోలు.

Published on Jun 30, 2020 2:43 pm IST

బాలీవుడ్ కి చెందిన రెండు బడా హీరోల చిత్రాలు పెద్ద పండుగలపై కన్నేశాయి. అక్షయ్ కుమార్ సూర్యవంశీ, రణ్వీర్ సింగ్ 83 చిత్రాలు దివాళి మరియు క్రిస్మస్ కానుకగా విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలు ఓ టి టి లో విడుదల అవుతాయంటూ ప్రచారం జరుగగా, అందులో ఎటువంటి నిజం లేదని తాజా సమాచారంతో స్పష్టం అయ్యింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సూర్యవంశీ దీపావళి కానుకగా విడుదల కానుంది. కత్రినా ఖైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అజయ్ దేవ్ గణ్, రణ్వీర్ సింగ్ క్యామియో రోల్స్ చేయడం విశేషం.

ఇక క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన 83 మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. హీరో రణ్వీర్ సింగ్ కపిల్ రోల్ చేయగా, దీపికా పదుకొనె ఆయన భార్య పాత్ర చేయడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More