అల్లు అర్జున్ మూవీలో అక్కినేని హీరో.

Published on Jun 7, 2019 9:34 am IST

సుశాంత్ 2008 ‘కాలిదాసు’ మూవీతో తెలుగు పరిశ్రమలో అక్కినేని హీరోగా అడుగుపెట్టారు. స్నేహ ఉల్లాల్ జంటగా చేసిన ‘కరెంట్’ మూవీ సుశాంత్ కి ఓ మంచి హిట్ అందించింది. అయితే ఆ తరువాత ఆయన చేసిన చిత్రాలేమి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. నేడు ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలో సుశాంత్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లుగా నిర్ధారించారు.ఆ మూవీ సెట్స్ లో మొదటి రోజు పాల్గొన్న సుశాంత్ ఈ సంధర్బంగా “తన ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారితో పనిచేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. అలాగే బన్నీ , ఫ్రెండ్ పూజా, టబు లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చినందుకు హారిక హాసిని క్రియేషన్స్,మరియు గీతా ఆర్ట్స్ కి కృతజ్ఞతలు. చి. ల. సౌ మూవీ తరువాత నేను చేస్తున్న ఈ మూవీ టీం దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకుంటాననే నమ్మకముంది”, అని ఎక్సయిటింగ్ ట్వీట్ చేశారు. ఐతే ఈ మూవీ లో తన పాత్ర ఏమిటన్న విషయాన్నీ అప్పుడే చెప్పనన్న సుశాంత్, తన అభిమానుల్ని సస్పెన్సు లో పెట్టారు.

సంబంధిత సమాచారం :

More