ట్రోల్ చేసినవారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సుశాంత్ !
Published on Jun 8, 2018 7:24 am IST


ఈమధ్య కాలంలో సినిమాలకు, సినీ తారలకు పెద్ద తలనొప్పిగా మారిన అంశం సోషల్ మీడియా ట్రోలింగ్. కొంతమంది ట్రోలర్స్ కావాలనే ఎప్పుడూ ఏదో ఒక స్టార్ ను టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఈ ఇబ్బందిని హీరో సుశాంత్ ఎదుర్కొన్నారు. కొందరు సుశాంత్ పాత ఫోటోతో ‘గట్టిగా కొడతా’ పేరుతో ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఆయన్ను త్రో చేయడం మొదలుపెట్టారు.

కొద్దిసేపట్లోనే ఈ పోస్టర్ వైరల్ గా మారింది. దీనికి స్పందించిన సుశాంత్ ఇలాంటి అబద్దపు వార్తలు క్రియేట్ చేసి తర్వాత దాన్ని ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నవారికి చప్పట్లు అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. సుశాంత్ ఇచ్చిన ఈ సమాధానంతో ఆయన అభిమానులకు అసలు ‘గట్టిగా కొడతా’ పేరుతో సినిమాయే లేదనే క్లారిటీ వచ్చింది. సుశాంత్ ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘చి ల సౌ’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నాడు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook