తవ్వేకుంది దిగ్బ్రాంతి కర విషయాలు

Published on Aug 1, 2020 4:55 pm IST

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి దాదాపు రెండు నెలలు అవుతుండగా పోలీసుల విచారణలో బయటకి వస్తున్న నిజాలు దిగ్బ్రాంతి కలిగిస్తున్నాయి. సుశాంత్ తండ్రి కే కే సింగ్ బీహార్ లో కేసు పెట్టిన నాటి నుండి ఈ కేసు అనేక మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి సుశాంత్ ఆత్మ హత్యకు కారణమైన వారిలో మొదటి ముద్దాయిగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అనేక మార్లు రియా చక్రవర్తి పోలీసుల విచారణకు హాజరు అయ్యింది.

కాగా సుశాంత్ సింగ్ బాడీ గార్డ్ తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితం అయ్యేవారని ఆయన చెప్పారు. అలాగే సుశాంత్ అనారోగ్యంతో బాధపడుతుంటే రియా కుటుంబ సభ్యులు ఆయన ఇంట్లో పార్టీలు చేసుకొనే వారని ఆయన చెప్పారు. దీనితో సుశాంత్ డబ్బులతో రియా జల్సాలు చేసిందని అర్థం అవుతుంది.

సంబంధిత సమాచారం :

More