సుశాంత్ ది కచ్చితంగా హత్యేనా ?

Published on Aug 3, 2020 2:41 pm IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో తవ్వేకుంది, నిజాలు బయటికి వస్తున్నాయి. సుశాంత్ మరణంలో అతని ప్రేయసి రియా చక్రవర్తి పాత్ర ఉంది అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇక ఈ కేసు విషయంలో తాజాగా సుశాంత్‌ ది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేననే ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా తన ట్విటర్ లో ఓ వీడియోని షేర్ చేశారు. సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి ఆ వీడియోలో వివరించారు. మొత్తానికి సుశాంత్ కేసులో ఏదో నిజం దాగి ఉందనిపిస్తోంది.

ప్రస్తుతం బీహార్ పోలీసులు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. బీహార్ పోలీసులు సుశాంత్ బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నారు. కాగా గత మూడు నెలల్లో మూడు కోట్ల రూపాయలు సుశాంత్ అకౌంట్ నుండి రియా చక్రవర్తి అకౌంట్ కు బదిలీ అయినట్లుగా గుర్తించారని తెలుస్తుంది. సుశాంత్ క్రెడిట్ కార్డ్ ను కూడా రియా చక్రవర్తి వాడుకుందని తెలుస్తోంది. ఫైనల్ గా రియా చక్రవర్తికి సుశాంత్ మరణంతో ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తోంది.

సంబంధిత సమాచారం :

More