అక్కినేని హీరో కొత్త మూవీ నేడే ప్రారంభం

Published on Jan 30, 2020 9:00 am IST

హీరో సుశాంత్ ఓ విభిన్నమైన టైటిల్ తో వస్తున్నాడు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న తాజా చిత్రం నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. దర్శక నిర్మాతలతో పాటు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో నేడు పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ కమెడియన్స్ వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటిస్తున్నారు. టైటిల్ తోనే చిత్రం విభిన్నంగా ఉంటుందనే సంకేతం పంపుతున్నారు.

దర్శకుడు దర్శన్ ఎస్ ఈ చిత్రాన్ని ఓ నూతన కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఏ ఐ స్టూడియోస్, సహస్త్ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నారు. సోలో హీరోగా మంచి హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్న సుశాంత్, ఈ చిత్రంతో హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు. ఇక ఇటీవల విడుదలైన సంక్రాంతి మూవీ అల వైకుంఠపురంలో చిత్రంలో సుశాంత్ ఓ కీలక రోల్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :