‘మాయ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటిఫుల్ హీరోయిన్ సుష్మా రాజ్. ఆ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. తర్వాత ‘జోరు’లో తన అందాల జోరును చూపింది. తాజాగా సుమంత్ హీరోగా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఓ చలాకీ అయిన అమ్మాయి పాత్రలో సుష్మా కనిపించనుంది. ‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్’ సినిమాతో ఇటివలే తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. విజయ్ అంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా అక్కడ సుష్మకు మంచి గుర్తింపు తెచ్చింది.


