‘సైరా’లో చిరు కుమార్తె కూడా !

Published on Jun 12, 2019 2:41 am IST

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘సైరా’. కొణిదెల ప్రోడక్షన్స్ నిర్మాణ సంస్థలో రామ్ చరణ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ పనుల్లో ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రం కోసం అనేక మంది టెక్నీషియన్లు, నిపుణులు పనిచేస్తున్నారు. వారిలో చిరు పెద్ద కుమార్తె సుస్మిత కూడా ఉన్నారు.

స్వతహాగా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్. గతంలో కొన్ని సినిమాల్లో చిరంజీవి కాస్ట్యూమ్స్ బాధ్యతలను సుస్మితే నిర్వహించారు. ‘ఖైదీ నెం 150’లో మెగాస్టార్ అంత స్టైలిష్ లుక్లో కనిపించడానికి ప్రధాన కారణం సుస్మిత డిజైన్ చేసిన దుస్తులే. ఇప్పుడు ‘సైరా’లో తమన్నా పాత్రకు దుస్తుల్ని డిజైనర్ అంజు మోదీతో కలిసి సుస్మిత డిజైన్ చేశారు. ఈ దుస్తుల గురించి తమన్నా మాట్లాడుతూ తన కెరీర్లో ధరించిన అత్యంత ఖరీదైన కాస్ట్యూమ్స్ అవేనని, సుస్మిత చాలా బాగా డిజైన్ చేశారని అంది.

సంబంధిత సమాచారం :

More