
సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న సినిమా ’ఒక్క అమ్మాయి తప్ప’. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ఈ సినిమా ఈ వారం విడుదలవుతున్నది. విడుదలకు ముందు చేస్తున్న ప్రమోషన్స్ తో సినిమా మీద అంచనాలు బాగా పెరుగుతున్నాయి. దాదాపు సగభాగం హైటెక్ సిటీ ప్లై ఓవర్ నేపథ్యంగా నడిచే ఈ సినిమాలో కేవలం ప్రేమకథే కాకుండా ఓ సస్పెన్స్ కోణం కూడా మిళితమై ఉంటుందని సమాచారం.
ప్రేమ్ కథగా మొదలయ్యే ఈ సినిమాలో విరామం తరువాత ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని సమాచారం. అలాగే మిక్కీ జె మేయర్ సమకూర్చిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుందని తెలిసింది. సందీప్ కిషన్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ని భోగాది అంజిరెడ్డి నిర్మించారు.