ఎన్టీఆర్ వీడియో రిలీజ్ పై ఇంకా సస్పెన్సే !

ఎన్టీఆర్ వీడియో రిలీజ్ పై ఇంకా సస్పెన్సే !

Published on Apr 25, 2020 12:00 AM IST

రాజమౌళి ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న తారక్ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేస్తాడా ? అంటే.. తనకే తెలియదని, కరోనా కారణంగా వర్క్ పోస్ట్ ఫోన్ అయిందని.. అయితే అప్పటికీ తారక్ పాత్రకు సంబంధించి వచ్చిన అవుట్ ఫుట్ ను బట్టే రిలీజ్ చేస్తామని లేకపోతె లేదని రాజమౌళి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశాడు.

కానీ ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కి సంబంధించిన వీడియో సిద్ధంగా ఉందని.. ఎన్టీఆర్ పుట్టినరోజున సర్ ప్రైజ్ చేస్తూ రిలీజ్ అవుతుందని కొందరు అంటున్నారు. మరి ఎన్టీఆర్ పై వీడియో రిలీజ్ అవుతుందో లేదో అని సస్పెన్స్ లో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు