“అఖండ” పై కొనసాగుతున్న మిస్టరీ.!

Published on May 6, 2021 10:00 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ చిత్రం “అఖండ”. దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆల్ మోస్ట్ కంప్లీట్ కాబడిన ఈ చిత్రానికి సంబంధించి గత కొంత కాలం నుంచి ఓ మిస్టరీ కొనసాగుతుంది. అదే ఈ చిత్రం విడుదల పట్ల. ఎపుడో మే నెలలో ఈ చిత్రం విడుదలను కన్ఫర్మ్ చేసేసారు.

కానీ మళ్ళీ కరోనా తీవ్రత వల్ల ఆల్రెడీ ఈ నెలలో ప్లాన్ చేసిన సినిమాలు అన్ని వాయిదా వేస్తున్నట్టుగా ఆయా సినిమాల మేకర్స్ అధికారిక ప్రకటనలు ఇచ్చేసారు. నిన్ననే మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడి యూనిట్ కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ అఖండ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి మూమెంట్ లేదు. మరి దీనిపై కూడా ఏదన్నా క్లారిటీ వస్తుందా అని నందమూరి అభిమానులు చూస్తున్నారు. మరి దీనిపై మేకర్స్ ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :