తారక్ సెన్సేషనల్ మల్టీస్టారర్ పై కొనసాగుతున్న సస్పెన్స్.!

Published on Apr 20, 2021 7:07 pm IST

మన దక్షిణాదిలో మంచి మాస్ క్రేజ్ ఉన్న టాప్ మోస్ట్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి ఇప్పుడు తారక్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీని తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో మరో సినిమాను తారక్ ఇటీవలే కమిట్ అయ్యాడు.

అయితే ఇదిలా ఉండగా తారక్ తో మరో భారీ మల్టీ స్టారర్ ను కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ ప్లాన్ చేస్తున్నాడని అది కూడా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో అని టాక్ వచ్చింది. ఇక అక్కడ నుంచి ఈ చిత్రంపై రూమర్స్ మరింత బలపడుతున్నాయి. అంతే కాకుండా కోలీవుడ్ వర్గాలు కూడా ఈ సెన్సేషనల్ మల్టీ స్టారర్ కోసం చెబుతున్నాయి. దీనితో ఈ కాంబోపై సస్పెన్స్ మరింత ఎక్కువవుతుంది. మరి నిజంగానే ఈ కాంబో సెట్ అవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :