కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ మాస్ స్పీడ్ తో తన సినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తాడని అందరికీ తెలిసిందే. అలా ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్నాయి. అయితే ఈ సినిమాలు కాకుండా మరో కొత్త సినిమా విషయంలో క్రేజీ బజ్ ఇపుడు నెలకొంది. డి వి అంటూ రెండు అక్షరాలు పెట్టి విడుదల చేసిన పోస్టర్ కోలీవుడ్ సహా తెలుగు ఆడియెన్స్ లో ఆసక్తి రేపింది.
అయితే ధనుష్ తో వర్క్ చేసే ఆ దర్శకుడు ఎవరు అనేదే పెద్ద సస్పెన్స్ గా మారింది. వెట్రిమారన్, వెంకట్ ప్రభు వినోద్ చోప్రా ఇలా పలువురు దర్శకులతో పాటుగా ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ పేరు కూడా వినిపిస్తుంది. ఇదెలా అంటే శంకర్ చేయనున్న డ్రీం ప్రాజెక్ట్ ‘వేల్పరి’ సినిమా కావచ్చని అనేక రూమర్స్ ఇపుడు ధను భారీ ప్రాజెక్ట్ చుట్టూతా తిరుగుతున్నాయి. సో అసలు ధనుష్ ఎవరితో చేయనున్నాడు అనేది రేపు జూలై 10తో ఓ క్లారిటీ వచేస్తుంది.


