సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో “జిన్” అనే వైవిధ్యభరితమైన చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించగా, అమిత్ రావ్ కథానాయకుడిగా నటించారు. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిఖిల్ ఎమ్ గౌడ నిర్మించారు. వైవిధ్యమైన కథకు ప్రాధాన్యత ఇస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించినట్టు చిత్రబృందం తెలిపింది.
ఈ సినిమాలో పర్వీజ్ సింబా, ప్రకాష్ తుంబినాడు, రవి భట్, సంగీత, బాల్రాజ్ వాడి వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషించారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర సంభాషణలు అందించగా, అలెక్స్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం పోస్టర్లు, వీడియోలకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది, ఇది సినిమాపై అంచనాలను పెంచింది.
‘జిన్’ అనే విభిన్నమైన శీర్షిక ఈ చిత్రానికి అదనపు బలంగా మారింది. హైదరాబాద్‌తో సహా కథకు సరిపోయే అనేక ప్రాంతాలలో షూటింగ్ జరిపినట్టు, కంటెంట్ పట్ల నమ్మకంతో నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదని యూనిట్ పేర్కొంది. సాధారణ హారర్ థ్రిల్లర్‌ల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుందని, థియేటర్లలో తప్పక విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.


