‘కాజల్ అగర్వాల్’ నుండి సస్పెన్స్ థ్రిల్లర్ !

Published on Jun 2, 2021 8:20 am IST

‘కాజల్ అగర్వాల్’ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటినుండి తన సినిమాల సెలక్షన్ ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. కథల ఎంపికలో కూడా కొత్తగా ఆలోచిస్తోందని, ముఖ్యంగా తన క్యారెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోందని తెలుస్తోంది. నిజానికి కాజల్ కి ఎప్పుడో లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో అవకాశాలు వచ్చినా చేయడానికి ఆసక్తి చూపించలేదు.

వరుసగా స్టార్ హీరోల సినిమాలలోనే ఛాన్స్ లు అందుకుంటూ కమర్షియల్ సినిమాలకే ఎక్కువగా పరిమితం అయింది. కానీ 36 ఏళ్ల వయసు, పైగా పెళ్లి అయింది. కనీసం ఇప్పుడైనా కొత్త క్యారెక్టర్లతో ప్రయోగాలు చేయకపోతే, తనలోని నటికి న్యాయం చేయలేను అని ఫీల్ అవుతుందట. అందుకే త్వరలోనే ఓ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేయబోతుంది కాజల్.

సంతోష్ శోభన్ హీరోగా గతంలో పేపర్ బాయ్ అనే సినిమా చేసిన దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో కాజల్ మెయిన్ లీడ్ గా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. జులై నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి రానుంది.

సంబంధిత సమాచారం :