కృష్ణ ‘మోసగాళ్ళకు మోసగాడు’ టైటిల్ తో సుధీర్ బాబు మూవీ

కృష్ణ ‘మోసగాళ్ళకు మోసగాడు’ టైటిల్ తో సుధీర్ బాబు మూవీ

Published on Mar 3, 2015 6:02 PM IST

Sudheer-Babu
కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన యంగ్ హీరో సుధీర్ బాబు వరుసగా తన తదుపరి సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే సుధీర్ బాబు – నందిత జంటగా నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇదిలా ఉంటే సుధీర్ బాబు అప్పుడే తన తదుపరి సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసాడు. ‘స్వామి రారా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత చక్రి చిగురుపాటి. చక్రి ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిస్తున్న సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సంగతి ఇది వరకే తెలియజేశాం.

ఈ సినిమా తాజా సమాచారం ఈ సినిమాకి ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నందిని హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెల్లూరు బోస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా కూడా స్వామి రారాలానే హిట్ అవుతుందని చక్రి చిగురుపాటి అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను త్వరలోనే ఫినిష్ చేసి ఏప్రిల్ లో సినిమాని రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు