ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న స్వాతి ముత్యం !

Published on Sep 26, 2022 11:14 am IST

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ‘స్వాతి ముత్యం’ సినిమాలో గణేశ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చాలా బాగుంది. ‘నిన్న నైట్ ఒక మూవీ చూశాను అండి. దానిలో కూడా హీరో హీరోయిన్లు మనలాగే.. కాపీ షాప్ లో కలుస్తారు’ అంటూ సాగిన ఈ ట్రైలర్ సినిమా పై ఉన్న భారీ అంచనాలను రెట్టింపు చేసింది.

మొత్తానికి ట్రైలర్‌ లో గణేష్ మరియు వర్ష మధ్య కెమిస్ట్రీ, అలాగే విజువల్స్, అండ్ డైలాగ్స్ సినిమా పై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో, అండ్ పోస్టర్స్ బాగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ రొమాంటిక్ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలను పోషించారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :