పెళ్లి పీటలెక్కిన ‘కలర్స్’ స్వాతి.. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు పంచుకున్న భామ..!

పెళ్లి పీటలెక్కిన ‘కలర్స్’ స్వాతి.. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు పంచుకున్న భామ..!

Published on Jul 8, 2026 6:58 PM IST

ప్రముఖ నటి, ‘కలర్స్’ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆమె ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ నాగోటిని వివాహం చేసుకుంది. శ్రీకాంత్ నాగోటి గతంలో స్వాతి ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ డ్రామా ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

​స్వాతి రెడ్డి, శ్రీకాంత్ నాగోటి తమ వివాహ బంధాన్ని ఒక జాయింట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అధికారికంగా పంచుకున్నారు. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కొత్త జంటకు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు, స్నేహితులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

​నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ చర్చను రేకెత్తించింది. ఈ చిత్రం స్వాతి నటనకు గానూ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే, ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రం తర్వాత స్వాతి మరే ఇతర సినిమా చేయలేదు.

తాజా వార్తలు