సంక్రాంతి స్పెషల్.. ‘స్వయంభూ’ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్..!

సంక్రాంతి స్పెషల్.. ‘స్వయంభూ’ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్..!

Published on Jan 15, 2026 11:25 PM IST

Swayambhu

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘స్వయంభూ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీకి సంబంధించి ప్రతి అప్‌డేట్‌తోనూ అంచనాలను మరింత పెంచుతూ, ఈ సినిమాను భారీ స్థాయిలో బలమైన కథనంతో కూడిన ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ ప్రెజెంట్ చేస్తున్నారు.

ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిత్ర బృందం ఒక స్పెషల్ స్టిల్‌ను రిలీజ్ చేశారు. పీరియడ్ గెటప్‌లో నిఖిల్ పండుగ వాతావరణంలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుండగా, ఆయన వెనుక భారీ ఆలయం, జాతర సెటప్ విజువల్‌గా అదనపు ఆకర్షణను అందిస్తోంది. ఈ స్టిల్ చూస్తేనే థియేటర్లలో సినిమా ఎంత గ్రాండ్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది.

ఈ చిత్రంలో నిఖిల్ లుక్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. పాత్ర కోసం ఆయన పెట్టిన కృషి ఒక్క ఫ్రేమ్‌లోనే స్పష్టంగా కనిపిస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘స్వయంభూ’ చిత్రం ఫిబ్రవరి 13, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు