
అఖిల్ కార్తీక్, ప్రియ వశిష్ట హీరోహీరోయిన్లుగా నటించగా శ్రీశ్రీ మూవీ క్రియేషన్స్ పతాకంపై అరుణ్‌కుమార్ ముప్పన నిర్మించిన సినిమా ‘స్విమ్మింగ్ పూల్’. నంది అవార్డు గ్రహీత మనోహర్ చిమ్మని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రొమాంటిక్ హర్రర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలూ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక ఈ మధ్యే విడుదలైన ఆడియోకు కూడా అంతటా మంచి రెస్పాన్స్ వస్తోందని తెలియజేస్తూ ఈ ఉదయం సినిమా యూనిట్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అమెరికా, యూకేల్లోనూ ఈ సినిమా విడుదల కానుందని నిర్మాత తెలిపారు. ఇక కేవలం 12 రోజుల్లో మంచి సాంకేతిక విలువలతో రూపొందిన ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రదీప్ చంద్ర ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనే జరగ్గా, ఒక చిన్న ఎపిసోడ్‌ను అమెరికాలోని హారిస్‌బర్గ్‌లో తీశారు.