చిరంజీవి సైరా ఇప్పుడు సత్తా చాటుతుంది..!

Published on Dec 4, 2019 7:20 am IST

ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి సైరా అనే భారీ పీరియాడిక్ మూవీ తో ముందుకొచ్చారు. రాయలసీమ కు చెందిన మొదటితరం ఉద్యమ వీరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది. దాదాపు ఐదు భాషలలో పాన్ ఇండియా మూవీగా విదులైన ఈ చిత్రం తెలుగులో విశేష ఆదరణ దక్కించుకుంది. కాగా కొద్ది రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.

దాదాపు ముప్పై కోట్ల వరకు చెల్లింది సైరా డిజిటల్ రైట్స్ అమెజాన్ సంస్థ దక్కించున్నట్లు సమాచారం. కాగా ఓ టి టి డిజిటల్ ఫార్మాట్ లో సైరా ఊహించిన దానికంటే ఎక్కువ ఆదరణ దక్కించుకుంటుంది. సైరా తెలుగులో మాత్రమే హిట్ మూవీగా నిలిచింది. ఇతర సౌత్ లాంగ్వేజ్ లలో అంతగా ఆడలేదు. కానీ ప్రైమ్ లో ఈ మూవీ తమిళ, మలయాళ, కన్నడ వర్షన్స్ ని కూడా ప్రేక్షకులు అధికంగా చూస్తున్నారని సమాచారం. సైరా సినిమాలో మంచి కంటెంట్ ఉన్నా కూడా సరైన ప్రమోషన్స్ లేకపోవడం వలననే ఇతర భాషలలో ఆడలేదు. ఇక చిరు తన 152వ చిత్రంగా దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

X
More