సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అంటున్న మెగా ఫ్యాన్స్ !

Published on Aug 29, 2019 3:00 am IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా అమితాబ్ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క ఇలా ప్రతీ ఒక్క ఇండస్ట్రీకు సంబంధించి అగ్ర నటులంతా ఈ సినిమాలో కనిపించడంతో సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. మిగిలిన భాషల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

కాగా ఖచ్చితంగా సైరా మరో సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ షోషల్ మీడియాలో వరుసగా కామెంట్లు పెడుతూ.. సైరా సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :